M'Cheyne Bible Journey

Plano sa Pagbasa ng Bibliya — M'Cheyne Isang Taon

Sundin itong Bible Reading Plan sa apat na sipi sa isang araw—ang Lumang Tipan minsan at ang Bagong Tipan at Mga Awit dalawang beses sa isang taon.

365 Naayos ang isang taong plano
4 Apat na pagbabasa sa isang araw
273 Napiling araw
‹ Araw 273 / 365 ›
Bersyon

Pagkumpirma ng pagbabasa

Natapos mo ba itong M'Cheyne day?

Kumpirmahin ito upang markahan ang araw na ito na kumpleto sa iyong tsart ng pag-unlad ng M'Cheyne.

Pamilya · Lumang Tipan

열왕기상 2

Buksan sa mambabasa →
Kabanata 2

David's Last Charge to Solomon

1దావీదు మరణించే సమయం సమీపించినప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలా ఆదేశించాడు.

2అతడు అన్నాడు, “మనుష్యులందరు వెళ్లవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండు.

3నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరిస్తే అంటే మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా, ఆయన శాసనాలు, ఆజ్ఞలు, చట్టాలు, నిబంధనలు అనుసరిస్తే నీవు ఏ పని మొదలుపెట్టినా ఎక్కడకు వెళ్లినా అన్నిటిలో వివేకంగా ప్రవర్తిస్తావు.

4అప్పుడు ‘నీ సంతతివారు తాము జీవించే విధానం పట్ల జాగ్రత్తగా ఉండి, నా ఎదుట తమ పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో నమ్మకంగా నడుచుకుంటే ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునే వారసుడు నీకు ఉండక మానడు’ అని యెహోవా నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు.

5“సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.

6నీకు తోచిన ప్రకారం అతనికి చేయవచ్చు, అయితే నెరిసిన తలవెంట్రుకలతో సమాధానంతో సమాధికి వెళ్లనివ్వకు.

7“అయితే గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల దయ చూపించు, నీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో వారిని ఉండనివ్వు. నేను మీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు వీరు నా పక్షాన నిలబడ్డారు.

8“బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను.

9అయితే ఇప్పుడు అతన్ని నిర్దోషిగా పరిగణించకు. నీవు జ్ఞానంగల వాడవు; అతనికి ఏం చేయాలో నీకు తెలుసు. అతని నెరసిన తలను రక్తంతో సమాధికి తీసుకెళ్లు.”

10ఆ తర్వాత దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడి, దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.

11దావీదు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.

12అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని పాలనాధికారం స్థిరపరచబడింది.

Adonijah Seeks Abishag and Is Put to Death

13హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియైన బత్షెబ దగ్గరకు వెళ్లాడు. బత్షెబ అతన్ని, “నీవు సమాధానంగా వచ్చావా?” అని అడిగింది.

14తర్వాత అతడు, “నేను నీతో ఓ విషయం చెప్పాలి” అని అన్నాడు.

15అప్పుడతడు, “నీకు తెలిసినట్లు, రాజ్యం నాకు చెందాల్సింది. ఇశ్రాయేలీయులంతా నన్ను తమ రాజుగా చూశారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, రాజ్యం నాది కాక నా సోదరునిది అయ్యింది; ఎందుకంటే అది యెహోవా నుండి అతనికి వచ్చింది.

16ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేస్తాను కాదు అనవద్దు” అన్నాడు.

17కాబట్టి అతడు మాట్లాడుతూ, “రాజైన సొలొమోనును షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని అడుగు. అతడు నీ మాట కాదు అనడు” అన్నాడు.

18అందుకు బత్షెబ, “మంచిది, నీ గురించి రాజుతో మాట్లాడతాను” అన్నది.

19బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకు అదోనియా తరుపున మాట్లాడడానికి వెళ్లినప్పుడు, రాజు ఆమెను కలుసుకోడానికి లేచి ఆమెకు నమస్కారం చేసి తన సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు తల్లి కోసం సింహాసనం ఒకటి తెప్పించాడు, ఆమె అతని కుడి ప్రక్కన కూర్చుంది.

20ఆమె, “నేను ఒక చిన్న మనవి చేయాలనుకున్నాను, నీవు కాదు అనకు” అన్నది.

21అప్పుడు ఆమె, “షూనేమీయురాలైన అబీషగును నీ సోదరుడైన అదోనియాను పెళ్ళి చేసుకోనివ్వు” అన్నది.

22అందుకు రాజైన సొలొమోను తన తల్లితో, “అదోనియా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? ఎంతైనా అతడు నాకు అన్న కాబట్టి అతని కోసం యాజకుడైన అబ్యాతారు కోసం సెరూయా కుమారుడైన యోవాబు కోసం రాజ్యాన్ని కూడా అడగవచ్చు కదా” అన్నాడు.

23అప్పుడు రాజైన సొలొమోను యెహోవా పేరిట ఇలా ప్రమాణం చేశాడు: “ఈ మనవి కోసం అదోనియా తన ప్రాణం చెల్లించకపోతే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక!

24నన్ను స్థిరపరచి, నా తండ్రియైన దావీదు సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి, తన వాగ్దానం ప్రకారం నా కోసం రాజవంశాన్ని స్థాపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అదోనియా ఈ రోజు చనిపోవలసిందే!”

25కాబట్టి రాజైన సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను ఆదేశించగా అతడు అదోనియాను కొట్టాడు. అతడు చనిపోయాడు.

Abiathar Banished and Joab Executed

26తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారుతో, “అనాతోతులో నీ పొలాలకు తిరిగి వెళ్లు. నీవు మరణానికి పాత్రుడవు కాని నీవు నా తండ్రియైన దావీదు ముందు ప్రభువైన యెహోవా మందసాన్ని మోసి, నా తండ్రికి కలిగిన శ్రమలన్నిటిలో పాలుపంచుకున్నావు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను చంపను” అన్నాడు.

27కాబట్టి సొలొమోను అబ్యాతారును యెహోవా యాజకుని పదవి నుండి తొలగించాడు. ఇలా షిలోహులో యెహోవా ఏలీ కుటుంబీకుల గురించి చెప్పిన మాట నెరవేరింది.

28గతంలో అబ్షాలోముతో కాకపోయినా అదోనియాతో కలిసి కుట్రపన్నిన యోవాబుకు ఈ వార్త చేరగానే అతడు యెహోవా గుడారానికి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.

29యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని రాజైన సొలొమోనుకు తెలిసింది. అప్పుడు సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను, “వెళ్లు, అతన్ని చంపు!” అని ఆదేశించాడు.

30కాబట్టి బెనాయా యెహోవా గుడారంలోకి ప్రవేశించి యోవాబుతో, “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని చెప్పాడు.

31అప్పుడు రాజు బెనాయాతో, “అతడు చెప్పినట్లే కానివ్వు. అతన్ని కొట్టి చంపి పాతిపెట్టు. అలా యోవాబు చిందించిన నిరపరాధ రక్తం గురించి నా మీద నా కుటుంబమంతటి మీద ఆ దోషం ఉండదు.

32అతడు చిందించిన రక్తానికి యెహోవా అతనికి ప్రతిఫలమిస్తారు. ఎందుకంటే అతనికంటే మంచివారు, ఉత్తములు అయిన నేరు కుమారుడు ఇశ్రాయేలు సేనాధిపతియైన అబ్నేరు, యెతెరు కుమారుడు యూదా సేనాధిపతియైన అమాశా అనే ఇద్దరిపై అతడు నా తండ్రియైన దావీదుకు తెలియకుండా దాడి చేసి వారిని ఖడ్గంతో చంపాడు.

33వారి రక్తం యొక్క అపరాధం యోవాబు మీద అతని సంతతివారి మీద ఎల్లప్పుడు ఉండును గాక. కాని దావీదు, అతని సంతతివారు, అతని ఇల్లు, అతని సింహాసనం మీద యెహోవా సమాధానం ఎల్లప్పుడు ఉండును గాక” అని చెప్పాడు.

34కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వెళ్లి యోవాబును కొట్టి చంపగా అతడు అరణ్యంలో తన ఇంటి దగ్గర పాతిపెట్టబడ్డాడు.

35రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాను యోవాబు స్థానంలో సైన్యాధిపతిగా, సాదోకును అబ్యాతారు స్థానంలో యాజకునిగా నియమించాడు.

The End of Shimei Who Broke His Oath

36తర్వాత రాజు షిమీని పిలిపించి అతనితో, “నీకోసం యెరూషలేములో ఇల్లు కట్టుకుని అక్కడ నివసించు, ఇంకెక్కడికీ వెళ్లకు.

37ఏ రోజైతే నీవు వెళ్లి కిద్రోను లోయను దాటుతావో, నీవు ఖచ్చితంగా చస్తావు; నీ ప్రాణానికి నీవే బాధ్యుడవు” అన్నాడు.

38షిమీ రాజుతో, “మీరు చెప్పింది మంచిది, మీ దాసుడననైన నేను నా ప్రభువైన రాజు చెప్పినట్లు చేస్తాను” అన్నాడు. కాబట్టి షిమీ యెరూషలేములో కొంతకాలం నివసించాడు.

39అయితే మూడేళ్ళ తర్వాత షిమీ దాసులలో ఇద్దరు పారిపోయి గాతు రాజు, మయకా కుమారుడైన ఆకీషు దగ్గరకు వెళ్లారు. “మీ దాసులు గాతులో ఉన్నారు” అని షిమీకి చెప్పబడింది.

40వెంటనే షిమీ తన గాడిదకు జీను కట్టుకుని తన దాసులను వెదకడానికి గాతులో ఉన్న ఆకీషు దగ్గరకు వెళ్లాడు. షిమీ వెళ్లి గాతు నుండి తన దాసులను తీసుకువచ్చాడు.

41షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగివచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు,

42రాజు షిమీని పిలిపించి అతనితో, “ ‘నీవు ఉన్నచోట నుండి ఎక్కడికి వెళ్లినా నీవు ఖచ్చితంగా చస్తావు’ అని యెహోవా పేరిట ప్రమాణం చేయించి నిన్ను హెచ్చరించలేదా? అప్పుడు నీవు నాతో, ‘మీరు చెప్పింది మంచిది. నేను లోబడతాను’ అని అన్నావు.

43మరి ఎందుకు యెహోవా పేరిట నీవు చేసిన ప్రమాణాన్ని, నేను జారీ చేసిన ఆజ్ఞను పాటించలేదు?” అని అన్నాడు.

44రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.

45కాని రాజైన సొలొమోను ఆశీర్వదించబడతాడు, దావీదు సింహాసనం యెహోవా ఎదుట నిరంతరం సుస్థిరంగా ఉంటుంది” అని అన్నాడు.

46తర్వాత రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయటకు వెళ్లి షిమీని కొట్టాడు. అతడు చనిపోయాడు.

Pamilya · Bagong Tipan

갈라디아서 6

Buksan sa mambabasa →
Kabanata 6

Bear One Another's Burdens and Do Good

1సహోదరీ సహోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరియైన మార్గంలోనికి మరలా తీసుకురండి. అంతేకాక మీరు కూడా శోధనలో పడిపోవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.

2ఒకరి భారాలను ఒకరు మోయండి, ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తారు.

3ఎవరైనా తమలో ఏ గొప్పతనం లేకపోయినా తాము గొప్పవారమని భావిస్తే వారు తమను తామే మోసపరచుకుంటారు.

4ప్రతి ఒక్కరూ తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు.

5ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి.

6వాక్యోపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నిటిని పంచుకోవాలి.

7మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడరు. ఒకరు దేన్ని విత్తుతారో దాని పంటనే కోస్తారు.

8తమ శరీరాలను సంతోషపరచడానికి విత్తేవారు తమ శరీరం నుండి నాశనమనే పంట కోస్తారు. తమ ఆత్మను సంతోషపరచడానికి విత్తేవారు తమ ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తారు.

9మంచి చేయడంలో మనం అలసి పోవద్దు ఎందుకంటే మానక చేస్తే తగిన కాలంలో మనం పంటను కోస్తాము.

10కాబట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ప్రజలందరికి మరి ముఖ్యంగా విశ్వాసుల కుటుంబానికి చెందిన వారికి మంచి చేద్దాము.

Boasting Only in the Cross of Christ

11నా స్వహస్తాలతో పెద్ద అక్షరాలను ఉపయోగించి మీకు వ్రాస్తున్నాను!

12శరీర సంబంధమైన వాటితో ప్రజలను ఆకట్టుకోవాలని అనుకునేవారు సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. క్రీస్తు సిలువ కోసం హింసించబడకుండ ఉండడానికే వారు ఇలా చేస్తారు.

13సున్నతి పొందినవారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు కాని శరీరానుసారమైన మీ సున్నతిని గురించి వారు గొప్పలు చెప్పుకోడానికి మీరు సున్నతి పొందాలని వారు కోరుచున్నారు.

14మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తప్ప మరి దేనిలో నేను అతిశయపడను. ఆ సిలువ ద్వారానే నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము.

15సున్నతి పొందినా పొందకపోయినా అది లెక్కకు రాదు. నూతన సృష్టి మాత్రమే లెక్కించబడుతుంది.

16ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి.

17నేను నా శరీరంపై యేసు గుర్తులను కలిగి ఉన్నాను, కాబట్టి ఇకపై ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు.

18సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆమేన్.

Lihim · OT / Mga Awit

에스겔 33

Buksan sa mambabasa →
Kabanata 33

The Duty and Calling of the Watchman

1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

2“మనుష్యకుమారుడా, నీ ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను ఒక దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించగా ఆ ప్రజలు తమలో ఒకరిని ఎంచుకుని అతన్ని తమ కావలివానిగా పెట్టుకుంటారు.

3అతడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదుతాడు,

4అప్పుడు ఒకవేళ ఎవరైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్త పడకపోతే ఆ ఖడ్గం వచ్చి వారి ప్రాణాన్ని తీస్తుంది, వారి చావుకు వారే బాధ్యులు.

5వారు బూర శబ్దం విని కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. ఒకవేళ వారు ఆ హెచ్చరికకు జాగ్రత్తపడి ఉంటే, వారు తమ ప్రాణాలను కాపాడుకునేవారు.

6అయితే ఒకవేళ కావలివాడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి కూడా ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదకపోతే, ఖడ్గం వచ్చి ఎవరినైనా చంపితే, చనిపోయినవారు తమ పాపాల కారణంగా చనిపోయినప్పటికి, నేను ఆ కావలివాన్ని బాధ్యున్ని చేస్తాను.’

7“మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు.

8నేను దుర్మార్గునితో, ‘దుర్మార్గుడా, నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, వారి మార్గాలను విడిచిపెట్టమని నీవు వాన్ని హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే వాని చావుకు నిన్ను బాధ్యున్ని చేస్తాను.

9అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా ఆ దుర్మార్గులు తమ దుష్టత్వాన్ని వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు, అయితే నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.

The Justice That Judges Each According to His Ways

10“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు, “మా పాపాలు దోషాలు మాకు భారంగా ఉన్నాయి, వాటివలన మేము క్షీణించి పోతున్నాము; మేమెలా బ్రతకాలి?” అని అంటున్నారు.’

11నీవు వారితో ఇలా చెప్పు, ‘నా జీవం తోడు, దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం ఉండదు గాని వారు తమ చెడు మార్గాలు విడిచి బ్రతికితే నాకు సంతోషము. తిరగండి! మీ చెడు మార్గాల నుండి తిరగండి! ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చస్తారు?’ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

12“కాబట్టి మనుష్యకుమారుడా, నీ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఒకవేళ నీతిమంతులు పాపం చేస్తే, వారి గతంలోని నీతికి విలువ ఉండదు. అలాగే దుష్టులు పశ్చాత్తాపపడితే, వారి యొక్క గతంలోని దుష్టత్వం శిక్షను తీసుకురాదు. పాపం చేసే నీతిమంతులు గతంలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ, వారు జీవించడానికి అనుమతించబడరు.’

13నీతిమంతులు తప్పక జీవిస్తారని నేను చెప్పినా సరే, వారు తమ నీతిని నమ్ముకొని పాపం చేస్తే, వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు; వారు చేసిన పాపానికి వారు చస్తారు.

14అలాగే ఒకవేళ నేను దుర్మార్గులతో, ‘మీరు తప్పక చస్తారు’ అని చెప్తే, వారు తమ పాపాన్ని విడిచిపెట్టి, న్యాయమైనవి, సరియైనవి చేస్తూ,

15వారు అప్పు ఇచ్చినప్పుడు తాకట్టుగా పెట్టుకున్న వాటిని తిరిగి ఇస్తే, వారు దొంగిలించింది తిరిగి ఇస్తే, జీవితాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తూ కీడు చేయనట్లైతే; ఆ వారు ఖచ్చితంగా బ్రతుకుతారు; వారు చనిపోరు.

16వారు చేసిన పాపాల్లో ఏదీ జ్ఞాపకం చేసుకోబడదు. వారు న్యాయమైనవి, సరియైనవి చేశారు; కాబట్టి వారు ఖచ్చితంగా బ్రతుకుతారు.

17“అయినా నీ ప్రజలు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. కాని నిజానికి వారి విధానమే న్యాయమైనది కాదు.

18నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి చెడు చేస్తే, ఆ పాపాన్ని బట్టి వారు చస్తారు.

19దుర్మార్గులు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వాటిని బట్టి వారు బ్రతుకుతారు.

20అయితే ఇశ్రాయేలీయులారా, మీరు ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటున్నారు. అయితే నేను మీ ప్రవర్తన బట్టి మీ అందరికి తీర్పు తీరుస్తాను.”

News of Jerusalem's Fall and the People's Hypocrisy

21మనం బందీలుగా వచ్చిన పన్నెండవ సంవత్సరం పదవనెల అయిదవ రోజున యెరూషలేములో నుండి తప్పించుకున్న ఒక మనుష్యుడు నా దగ్గరికి వచ్చి, “పట్టణం కూలిపోయింది!” అని చెప్పాడు.

22అతడు ఇక్కడకు రావడానికి ముందు సాయంత్రం యెహోవా హస్తం నా మీద ఉంచి, ఉదయం ఆ వ్యక్తి నా దగ్గరికి రాకముందు ఆయన నా నోరు తెరిచారు. కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను ఇక మౌనంగా ఉండను.

23అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

24“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల మధ్య నివసిస్తున్నవారు, ‘అబ్రాహాము ఒంటరిగానే ఈ దేశమంతటిని స్వాధీనపరచుకున్నాడు. కాని మనమైతే చాలామందిమి; ఖచ్చితంగా ఈ దేశం మనకు మన స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు.

25కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మాంసంలో ఇంకా రక్తం ఉండగానే తింటూ, మీ విగ్రహాలవైపు చూస్తూ రక్తాన్ని చిందిస్తున్నారు, అలాంటి మీరు భూమిని స్వాధీనం చేసుకోగలరని అనుకుంటున్నారా?

26మీరు మీ ఖడ్గం మీద ఆధారపడుతున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు, మీలో ప్రతి ఒక్కరూ మీ పొరుగువాని భార్యను అపవిత్రం చేస్తారు; అలాంటి మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోగలరా?’

27“వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నా జీవం తోడు, శిథిలాల్లో మిగిలి ఉన్నవారు ఖడ్గం చేత కూలిపోతారు, బయట పొలంలో ఉన్నవారు అడవి మృగాలకు ఆహారమవుతారు, కోటలలో గుహల్లో ఉన్నవారు తెగులుతో చస్తారు.

28నేను ఆ దేశాన్ని నిర్మానుష్యంగా చేస్తాను. దాని బల గర్వం ముగిసిపోతుంది, వాటి గుండా ఎవరూ వెళ్లకుండా ఇశ్రాయేలీయుల పర్వతాలు నిర్జనమవుతాయి.

29వారు చేసిన అసహ్యమైన పనులను బట్టి నేను వారి దేశాన్ని పాడు చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’

30“మనుష్యకుమారుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇళ్ళ గుమ్మాల దగ్గర నిలబడి నీ గురించి మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు, ‘రండి యెహోవా దగ్గర నుండి వచ్చిన సందేశం ఏంటో విందాం’ అని చెప్పుకుంటున్నారు.

31నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి.

32నిజానికి, వారికి నీవు అందమైన స్వరంతో ప్రేమ పాటలు పాడే వాడివి, వాయిద్యాన్ని చక్కగా వాయించే వాడివి తప్ప మరేమీ కాదు, ఎందుకంటే వారు మీ మాటలు వింటారు కానీ వాటిని పాటించరు.

33“ఇవన్నీ నిజమైతే! ఖచ్చితంగా నిజమవుతాయి. అప్పుడు తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకుంటారు.”

Lihim · Bagong Tipan

시편 81, 82

Buksan sa mambabasa →
Kabanata 81

A Voice Urging Obedience at the Feast

1మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి;

2సంగీతం మొదలుపెట్టండి, కంజర వాయించండి.

3అమావాస్య దినాన కొమ్ము ఊదండి,

4ఇశ్రాయేలీయులకు ఇది శాసనం;

5దేవుడు ఈజిప్టు మీదికి దండెత్తినప్పుడు,

6“నేను వారి భుజాల మీది నుండి భారం తొలగించాను;

7మీ బాధలో మీరు మొరపెట్టగా నేను మిమ్మల్ని రక్షించాను,

8నా ప్రజలారా, నా మాట వినండి, నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను

9మీ మధ్య ఇతర దేవుడు ఉండకూడదు;

10నేను మీ దేవుడనైన యెహోవాను,

11“కాని నా ప్రజలు నా మాట వినలేదు;

12కాబట్టి వారి సొంత ఉపాయాలను అనుసరిస్తే ఎంత మేలు!

13“నా ప్రజలు నా మాట మాత్రమే వింటే,

14అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచివేసేవాన్ని,

15యెహోవాను ద్వేషించేవారు ఆయన ఎదుట భయంతో దాక్కుంటారు,

16కానీ మిమ్మల్ని నేను శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను;

Kabanata 82

A Rebuke Against Unjust Judges

1దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు;

2“మీరు ఎంతకాలం అన్యాయాలను సమర్థిస్తారు

3బలహీనులు, తండ్రిలేనివారి పక్షం వహించండి;

4బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి;

5“వారికి ఏమి తెలియదు, వారు ఏమి గ్రహించరు.

6“ ‘మీరు “దేవుళ్ళు”;

7అయితే మీరు ఇతర మనుష్యుల్లా చస్తారు;

8ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి,