నాలుగు వైపులా ఉన్న అతని శత్రులమీద యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చి నెమ్మది కలిగించిన తర్వాత రాజు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత,
EN
Copywork
Telugu OTSA 2 Samuel 7장
Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
Practice by section · 2 Samuel
రాజు నాతాను ప్రవక్తతో, “ఇదిగో దేవుని మందసం గుడారంలో ఉంటుండగా నేను దేవదారు చెక్కలతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను” అన్నాడు.
అందుకు నాతాను రాజుతో, “యెహోవా నీకు తోడుగా ఉన్నారు కాబట్టి నీ మనస్సులో ఏముందో అది చేయి” అన్నాడు.
అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతాను దగ్గరకు ఇలా వచ్చింది:
“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టించేది నీవా?
ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. గుడారంలో నివసిస్తూ ఒకచోట నుండి మరో చోటికి తిరుగుతున్నాను.
ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ఇశ్రాయేలు ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి పాలకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’
“కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.
నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.
నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎలాంటి తొందర లేకుండా వారి స్వస్థలంలో నివసించేలా వారిని అందులో నాటుతాను. గతంలో వారు చేసినట్లుగా దుర్మార్గులు వారిని ఇక బాధించరు,
అంతేకాదు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం నుండి జరిగినట్టు దుర్మార్గులు ఇక వారిని బాధించరు. నీ శత్రువులందరి నుండి నీకు నెమ్మది కలుగజేస్తాను.
నీ దినాలు ముగిసి నీవు నీ పూర్వికుల దగ్గరకు వెళ్లినప్పుడు నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.
నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.
నీ ముందు నుండి నేను తొలగించిన సౌలుకు దూరం చేసినట్లుగా అతనికి నా ప్రేమను దూరం చేయను.
నా ఎదుట నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”
నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు.
అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి, యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు:
ప్రభువైన యెహోవా! మీ దృష్టిలో ఇది చాలదన్నట్టు మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. ప్రభువైన యెహోవా! మామూలు మనుష్యుల పట్ల మీరు ఇంత కార్యం చేస్తారా?
“దావీదు మీతో ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్పగలడు? ప్రభువైన యెహోవా! మీ సేవకుని గురించి మీకు తెలుసు.
మీ మాట కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి మీ సేవకునికి తెలియజేశారు.
“ప్రభువైన యెహోవా! మీరు ఎంత గొప్పవారు! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.
మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వారి దేవుళ్ళను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు.
మీరు ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు.
“ఇప్పుడు దేవా, యెహోవా! మీ సేవకునికి అతని కుటుంబానికి మీరు చేసిన వాగ్దానాన్ని ఎల్లకాలం స్థిరపరచండి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి;
తద్వారా మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవాయే ఇశ్రాయేలీయుల దేవుడు’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది.
“సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు దేవా, ‘నేను నీకు రాజవంశాన్ని స్థాపిస్తాను’ అని మీరు ఈ విషయాన్ని మీ సేవకునికి తెలియజేశారు. కాబట్టి మీకు ఈ ప్రార్థన ప్రార్థించడానికి మీ సేవకునికి ధైర్యం కలిగింది.
ప్రభువైన యెహోవా, మీరే దేవుడు! మీ మాటలు నమ్మదగినవి. మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు.
మీ సేవకుని వంశం నిత్యం మీ సన్నిధిలో ఉండేలా దీవించండి; ప్రభువైన యెహోవా, మీరు చెప్పినట్లుగా మీ దీవెనలతో మీ సేవకుని కుటుంబం శాశ్వతంగా దీవించబడుతుంది.”