“నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
KO
Copywork
Telugu OTSA 예레미야 23장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 예레미야
కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను మేపుతున్న గొర్రెల కాపరులతో ఇలా అంటున్నారు: “మీరు నా మందను చెదరగొట్టి వాటిని తరిమివేసి వాటిని పట్టించుకోనందున, మీరు చేసిన దుర్మార్గానికి నేను మీకు శిక్ష విధిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి.
వాటిని మేపడానికి నేను గొర్రెల కాపరులను నియమిస్తాను, అవి ఇకపై భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“రాబోయే రోజుల్లో,
అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది
యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో, ఇకపై ప్రజలు, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట అని చెప్పరు’
అయితే, ‘ఇశ్రాయేలీయుల సంతానాన్ని ఉత్తర దేశంలో నుండి, ఆయన వారిని బహిష్కరించిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట’ అని వారు చెప్తారు. అప్పుడు వారు వారి స్వదేశంలో నివసిస్తారు.”
ప్రవక్తల గురించి:
దేశమంతా వ్యభిచారులతో నిండిపోయింది;
“ప్రవక్త యాజకుడు ఇద్దరూ భక్తిహీనులే;
“కాబట్టి వారి దారి జారే నేలలా అవుతుంది;
“సమరయ ప్రవక్తల్లో
యెరూషలేము ప్రవక్తల్లో
కాబట్టి సైన్యాల యెహోవా ప్రవక్తలను గురించి ఇలా అంటున్నారు:
సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:
‘మీకు సమాధానం కలుగుతుంది యెహోవా చెప్తున్నారు’
అయితే ఆయనను చూడడానికి, ఆయన మాట వినడానికి
చూడండి, యెహోవా ఉగ్రత
యెహోవా తన హృదయ ఉద్దేశాలను
నేను ఈ ప్రవక్తలను పంపలేదు,
కానీ ఒకవేళ వారు నా సభలో నిలబడి ఉంటే,
“నేను దగ్గరగా ఉంటేనే దేవుణ్ణా,
నాకు కనబడకుండ ఎవరైనా
“నా పేరిట అబద్ధాలు చెప్పే ప్రవక్తలు చెప్పేది నేను విన్నాను. వారు, ‘నాకొక కల వచ్చింది! నాకొక కల వచ్చింది!’ అని అంటారు.
తమ మనస్సులోని భ్రమలను ప్రవచించే ఈ అబద్ధాల ప్రవక్తల హృదయాల్లో ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?
తమ పూర్వికులు బయలును ఆరాధించి నా పేరును మరచిపోయినట్లే, వీరు ఒకరికొకరు చెప్పుకునే కలలు నా ప్రజలు నా పేరును మరచిపోయేలా చేస్తాయని వీరు అనుకుంటున్నారు.
కలలు కనే ప్రవక్తలు వారి కలలను చెప్పవచ్చు, నా సందేశాన్ని పొందుకున్న వారు ఆ సందేశాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. పొట్టుకు ధాన్యంతో ఏమి సంబంధం?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“నా మాట అగ్నిలాంటిది కాదా, బండను ముక్కలు చేసే సుత్తిలాంటిది కాదా? అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“కాబట్టి,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఒకరి నుండి నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.
అవును” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “తమ నాలుకలతో తమ స్వంత మాటలు మాట్లాడుతూ ‘యెహోవా ప్రకటిస్తున్నారు’ అనే చెప్పే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.
నిజానికి, తప్పుడు కలలను ప్రవచించే వారికి నేను వ్యతిరేకిని” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారు తమ మోసపూరితమైన అబద్ధాలతో నా ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తారు, నేను వారిని పంపలేదు వారిని నియమించలేదు. వారి వల్ల ఈ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“ఈ ప్రజలు గాని ఒక ప్రవక్త గాని యాజకుడు గాని, ‘యెహోవా నుండి ఏం సందేశం వచ్చింది?’ అని నిన్ను అడిగినప్పుడు, ‘ఏ సందేశం? నేను మిమ్మల్ని విడిచిపెడతాను అని యెహోవా చెప్తున్నారు’ అని చెప్పు.
ఒకవేళ ప్రవక్త గాని యాజకుడు గాని లేదా ఇంకెవరైనా, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని చెప్పినట్లయితే, నేను వారిని వారి ఇంటివారిని శిక్షిస్తాను.
మీరు మీ స్నేహితులతో ఇతర ఇశ్రాయేలీయులతో, ‘యెహోవా జవాబేంటి? యెహోవా ఏమి చెప్పారు?’ అని అనాలి.
కానీ మీరు ‘యెహోవా సందేశం’ అని చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి మాట వారికి సందేశం అవుతుంది. మీరు సజీవుడైన దేవుని మాటలను, మన దేవుడైన సైన్యాల యెహోవా మాటలను తారుమారు చేశారు.
మీరు ప్రవక్తతో ఇలా చెప్పాలి: ‘యెహోవా నీకు ఇచ్చిన జవాబేంటి? యెహోవా ఏమి చెప్పారు?’
‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెబితే, యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెప్పకూడదని నేను మీతో చెప్పినా సరే, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెప్పారు.
కాబట్టి, నేను మిమ్మల్ని పూర్తిగా మరచిపోతాను, నేను మీకు మీ పూర్వికులకు ఇచ్చిన పట్టణంతో పాటు మిమ్మల్ని నా సన్నిధిలో నుండి వెళ్లగొడతాను.
నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.”