జీఫీయులు గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వెళ్లి, “దావీదు యెషీమోను ఎదురుగా ఉన్న హకీలా కొండలో దాక్కోలేదా?” అని అన్నారు.
KO
Copywork
Telugu OTSA 사무엘상 26장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 사무엘상
కాబట్టి సౌలు బయలుదేరి ఇశ్రాయేలీయులలో ఎంపిక చేయబడిన మూడువేలమంది సైన్యంతో దావీదును వెదకడానికి జీఫు అరణ్యానికి వెళ్లాడు.
సౌలు యెషీమోనుకు ఎదురుగా ఉన్న హకీలా కొండ ప్రాంతంలో దారి ప్రక్కన బసచేశాడు, అయితే దావీదు అరణ్యంలోనే నివసించాడు. తనను వెంబడిస్తూ సౌలు అరణ్యానికి వచ్చాడని విని,
దావీదు తన వేగులవారిని పంపి, సౌలు నిజంగానే వచ్చాడని తెలుసుకున్నాడు.
తర్వాత దావీదు బయలుదేరి సౌలు బసచేసిన చోటికి వెళ్లి, సౌలు, సేనాధిపతియైన నేరు కుమారుడు అబ్నేరు ఎక్కడ పడుకున్నారో చూశాడు. సౌలు శిబిరం లోపల పడుకున్నాడు, సైన్యమంతా అతని చుట్టూ ఉంది.
అప్పుడు దావీదు, “శిబిరంలోనికి సౌలు దగ్గరకు నాతో పాటు ఎవరు వస్తారు?” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడైన యోవాబుకు సోదరుడైన అబీషైని అడిగాడు.
దావీదు, అబీషై రాత్రివేళ ఆ సైన్యం దగ్గరకు వెళ్లినప్పుడు సౌలు శిబిరం లోపల పడుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని తల దగ్గర నేలమీద గుచ్చి ఉంది. అబ్నేరు, సైన్యం అతని చుట్టూ పడుకుని ఉన్నారు.
అప్పుడు అబీషై దావీదుతో, “దేవుడు ఈ రోజు నీ శత్రువును నీకప్పగించారు. కాబట్టి నీవు ఒప్పుకుంటే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతడిని భూమిలో దిగేలా చేస్తాను, రెండవ పోటు పొడిచే అవసరం కూడా ఉండదు” అన్నాడు.
అయితే దావీదు అబీషైతో, “అతన్ని చంపవద్దు, యెహోవా అభిషేకించిన వానిని చంపినవారు నిర్దోషులుగా ఉండగలరా?
దావీదు ఇంకా మాట్లాడుతూ, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, యెహోవాయే అతన్ని శిక్షిస్తారు. అతని సమయం వచ్చినప్పుడు అతడే చనిపోతాడు లేదా యుద్ధంలో నశిస్తాడు.
అయితే యెహోవా అభిషేకించిన వానిపైకి నేను చేయి ఎత్తకుండ యెహోవా నన్ను ఆపివేయును గాక. అతని తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకుని మనం వెళ్లిపోదాం రా” అని చెప్పాడు.
దావీదు సౌలు తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకున్నాడు, అప్పుడు వారిద్దరు వెళ్లిపోయారు. యెహోవా వారికి గాఢనిద్ర కలుగజేశారు కాబట్టి వారందరు నిద్రలో ఉన్నారు. ఎవరూ వచ్చిన వారిని చూడలేదు, జరిగింది వారికి తెలియదు.
తర్వాత దావీదు అవతలి వైపుకు వెళ్లి దూరంగా కొండమీద నిలబడ్డాడు, వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది.
దావీదు సైన్యాన్ని, నేరు కుమారుడైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, నీవు నాకు జవాబివ్వవా?” అని అన్నాడు.
అందుకు దావీదు, “అబ్నేరూ, నీవు మగాడివి కావా? ఇశ్రాయేలీయులలో నీలాంటి వారెవరు? నీ ప్రభువైన రాజుకు నీవెందుకు కాపలా కాయలేదు? నీ ప్రభువైన రాజును చంపడానికి ఒకడు దగ్గరకు వచ్చాడు.
నీవు చేసింది సరియైనది కాదు, యెహోవా అభిషేకించిన నీ యజమానికి నీవు రక్షణ ఇవ్వలేకపోయావు కాబట్టి సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నీ మనుష్యులు తప్పకుండా చావాలి. రాజు తల దగ్గర ఉండాల్సిన అతని ఈటె, నీళ్ల కూజా ఎక్కడ ఉన్నాయి?” అన్నాడు.
సౌలు దావీదు స్వరం గుర్తుపట్టి, “దావీదూ నా కుమారుడా, ఇది నీ స్వరమేనా?” అని అడిగాడు.
నా ప్రభువు తన సేవకుడిని ఎందుకు తరుముతున్నాడు? నేనేమి చేశాను? నేను చేసిన తప్పేంటి?
ఇప్పుడు నా ప్రభువైన రాజు తన సేవకుని మాటలు వినాలి. ఒకవేళ యెహోవాయే మిమ్మల్ని నా మీదికి రెచ్చగొట్టి ఉంటే, ఆయన నా అర్పణను అంగీకరించును గాక. కానీ ఒకవేళ ఇది మనుష్యుల కుట్ర అయితే అందులో ఉన్నవారిని యెహోవా శపించును గాక! ఈ రోజు వారు యెహోవా వారసత్వంలో నా వాటా నుండి నన్ను వెలివేసి, ‘వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించు’ అని అన్నారు.
యెహోవా సన్నిధికి దూరంగా నా రక్తం నేలపై పడకూడదు. ఒకడు పర్వతాల్లో కౌజుపిట్టను వేటాడినట్లు ఇశ్రాయేలు రాజు ఈగను వెదకడానికి బయటకు వచ్చాడు” అని అన్నాడు.
అందుకు సౌలు, “నేను పాపం చేశాను. దావీదూ నా కుమారుడా, తిరిగి రా. ఈ రోజు నీవు నా ప్రాణాన్ని విలువైనదిగా గుర్తించావు, కాబట్టి నేను మరలా నీకు హాని చేయడానికి ప్రయత్నించను. నేను ఒక మూర్ఖునిలా చాలా భయంకరమైన తప్పు చేశాను” అన్నాడు.
అప్పుడు దావీదు, “రాజా, ఇదిగో రాజు ఈటె ఇక్కడ ఉంది, నీ పనివారిలో ఒకడు వచ్చి దానిని తీసుకెళ్లవచ్చు.
యెహోవా ప్రతిఒక్కరికి వారి నీతికి నమ్మకత్వానికి బహుమానం ఇస్తారు. యెహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్పగించారు కాని, యెహోవా అభిషేకించిన వాని మీద నేను చేయి వేయను.
ఈ రోజు నీ ప్రాణానికి విలువను ఇచ్చినందుకు యెహోవా నా ప్రాణానికి విలువనిచ్చి అన్ని బాధలనుండి నన్ను విడిపించును గాక” అని చెప్పాడు.
అందుకు సౌలు దావీదుతో, “దావీదూ, నా కుమారుడా, నీవు దీవించబడుదువు గాక; నీవు గొప్ప పనులు చేస్తావు, ఖచ్చితంగా విజయం పొందుతావు” అన్నాడు.