దీని అంతటిని పరిశీలించి నేనో నిర్ణయానికి వచ్చాను ఏంటంటే నీతిమంతులు జ్ఞానులు వారు చేసే పనులు దేవుని చేతుల్లో ఉన్నాయని, అయితే వారి కోసం ప్రేమ ఎదురుచూస్తుందా లేదా ద్వేషమా అనేది ఎవరికీ తెలియదు.
KO
Copywork
Telugu OTSA 전도서 9장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 전도서
జరిగేవన్నీ అందరికి ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు దుర్మార్గులకు, మంచివారికి చెడ్డవారికి, అపవిత్రులకు పవిత్రులకు, బలులు అర్పించేవారికి అర్పించని వారికి అందరికి ఒకే విధంగా జరుగుతాయి.
అందరికి ఒకే విధంగా జరగడం సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిలో చాలా చెడ్డ విషయం. అంతేకాక, మనుష్యుల హృదయాలు చెడుతో నిండి ఉన్నాయి, వారు బ్రతికి ఉన్నప్పుడు వారి హృదయాల్లో పిచ్చి ఉంటుంది, తర్వాత వారు చచ్చినవారితో కలిసిపోతారు.
బ్రతికి ఉన్నవారి మధ్యలో ఉండే వారికే నిరీక్షణ ఉంటుంది; చనిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క నయం కదా!
బ్రతికి ఉన్నవారికి తాము చనిపోతామని తెలుసు,
వారి ప్రేమ, వారి ద్వేషం
వెళ్లండి, సంతోషంగా మీ ఆహారాన్ని తినండి ఆనందకరమైన హృదయంతో మీ ద్రాక్షరసం త్రాగండి, ఎందుకంటే మీరు చేసే దాన్ని దేవుడు ముందుగానే ఆమోదించారు.
ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో.
సూర్యుని క్రింద దేవుడు మీకు ఇచ్చిన ఈ అర్థరహితమైన జీవితకాలమంతా మీరు ప్రేమించే మీ భార్యతో జీవితాన్ని ఆస్వాదించండి; ఎందుకంటే ఇది మీ జీవితంలో సూర్యుని క్రింద మీరు పడిన కష్టంలో మీకు లభించే భాగము.
మీ చేతికి వచ్చిన ఏ పనియైనా శక్తివంచన లేకుండా చేయండి. ఎందుకంటే మీరు వెళ్తున్న పాతాళంలో పని చేయడం గాని ప్రణాళిక వేయడం గాని లేదా తెలివి గాని జ్ఞానం గాని ఉండవు.
సూర్యుని క్రింద మరొకటి కూడ నేను గమనించాను:
అంతేకాక, వాటి సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు:
నేను సూర్యుని క్రింద నన్ను బాగా ఆకట్టుకొన్న జ్ఞానం యొక్క ఈ ఉదాహరణను నేను చూశాను:
ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్న ఒక చిన్న పట్టణం ఉండేది. ఒక శక్తివంతమైన రాజు వచ్చి దానిని చుట్టుముట్టి, దానికి ఎదురుగా భారీ ముట్టడి దిబ్బలు కట్టాడు.
ఇప్పుడు ఆ పట్టణంలో ఉండే ఒక పేదవాడు తన జ్ఞానంతో ఆ పట్టణాన్ని కాపాడాడు. కానీ ఆ పేదవాన్ని ఎవరూ జ్ఞాపకం ఉంచుకోలేదు.
కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “బలం కన్నా జ్ఞానం మేలు” కానీ ఆ పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది, అతని మాటలు ఇకపై పట్టించుకోరు.
మూర్ఖుల పాలకుడి కేకల కంటే
యుద్ధాయుధాలకంటె జ్ఞానం మేలు,