తర్వాత లేవీయుల కుటుంబ పెద్దలు కనానులోని షిలోహులో ఉన్న యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువను ఇశ్రాయేలులోని ఇతర గోత్రాల కుటుంబాల పెద్దలను కలిసి,
EN
Copywork
Telugu OTSA Joshua 21장
Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
Practice by section · Joshua
వారితో కనానులోని షిలోహులో వారితో, “మీరు మా పశువులకు పచ్చికబయళ్లతో పాటు మాకు నివసించడానికి పట్టణాలు ఇవ్వమని మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించారు” అన్నారు.
కాబట్టి, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు తమ సొంత వారసత్వంలో నుండి ఈ క్రింది పట్టణాలను, పచ్చికబయళ్లను లేవీయులకు ఇచ్చారు:
కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.
మిగిలిన కహాతు సంతతివారికి ఎఫ్రాయిం, దాను, మనష్షే అర్థ గోత్రాల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు ఇచ్చారు.
గెర్షోను సంతతివారికి ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్థ గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.
మెరారి సంతతివారికి వారి వంశాల ప్రకారం, రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించారు.
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు లేవీయులకు చీట్ల ద్వారా ఈ పట్టణాలను, వాటి పచ్చికబయళ్లను కేటాయించారు.
వారు యూదా, షిమ్యోను గోత్రాల నుండి క్రింద చెప్పిన పట్టణాలను కేటాయించారు.
లేవీయులైన కహాతీయుల వంశాల్లోని అహరోను సంతతివారికి ఈ క్రింది పట్టణాలు కేటాయించారు, ఎందుకంటే మొదటి చీటి వారికి పడింది:
వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.)
అయితే వారు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలను, గ్రామాలను స్వాస్థ్యంగా ఇచ్చారు.
కాబట్టి యాజకుడైన అహరోను సంతతివారికి హెబ్రోను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), లిబ్నా,
యత్తీరు, ఎష్తెమోవా,
హోలోను, దెబీరు,
ఆయిను, యుత్తా, బేత్-షెమెషు వాటి పచ్చికబయళ్లతో పాటు, ఈ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలిచ్చారు.
బెన్యామీను గోత్రం నుండి వారికి ఇచ్చినవి:
అనాతోతు, అల్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
అహరోను సంతతివారైన యాజకులకు పచ్చికబయళ్లతో పాటు ఇచ్చిన పట్టణాలు మొత్తం పదమూడు.
లేవీయులైన కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఎఫ్రాయిం గోత్రం నుండి కేటాయించిన పట్టణాలు:
ఎఫ్రాయిం కొండ సీమలో వారికి ఇచ్చినవి:
కిబ్సాయిము, బేత్-హోరోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
దాను గోత్రం నుండి వారికి ఇచ్చినవి:
అయ్యాలోను, గాత్-రిమ్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
మనష్షే అర్థగోత్రం నుండి వారికి ఇచ్చినవి:
ఈ పది పట్టణాలు, వాటి పచ్చికబయళ్లు మిగిలిన కహాతీయుల వంశాలకు ఇచ్చారు.
గెర్షోనీయుల లేవీ గోత్ర వంశాలకు ఇచ్చినవి:
ఇశ్శాఖారు గోత్రం నుండి:
యర్మూతు, ఎన్-గన్నీము దాని పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
ఆషేరు గోత్రం నుండి:
హెల్కతు రెహోబు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
నఫ్తాలి గోత్రం నుండి:
గెర్షోనీయుల వంశాల పట్టణాల సంఖ్య, వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం పదమూడు.
మెరారీయ వంశాలకు (లేవీయులలో మిగిలిన వారు) ఇచ్చారు:
దిమ్న, నహలాలు వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
రూబేను గోత్రం నుండి:
కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
గాదు గోత్రం నుండి:
హెష్బోను, యాజెరు, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
లేవీయులలో మిగిలిన వారైన మెరారి వంశాలకు కేటాయించిన పట్టణాల సంఖ్య మొత్తం పన్నెండు.
ఇశ్రాయేలీయుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని లేవీయుల పట్టణాలు వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం నలభై ఎనిమిది.
ఈ పట్టణాలన్నిటి చుట్టూ పచ్చికబయళ్లు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికి అలాగే ఉన్నాయి.
కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులకు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశమంతా ఇచ్చారు, వారు దానిని స్వాధీనం చేసుకుని అక్కడ స్థిరపడ్డారు.
యెహోవా వారి పూర్వికులతో ప్రమాణం చేసినట్లే వారికి అన్నివైపులా విశ్రాంతిని ఇచ్చారు. వారి శత్రువులలో ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులకు ఎదురు నిలబడలేకపోయారు; యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించారు.
ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మంచి వాగ్దానాలలో నెరవేరకుండా ఒక్కటి కూడా లేదు; ప్రతి ఒక్కటి నెరవేరింది.