scripture.how Bible Copywork
EN

Copywork

Telugu OTSA Ruth 4장

Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.

KO Korean
ZH Chinese
JA Japanese
HI Hindi
BN Bengali
TA Tamil
TE Telugu
ML Malayalam
FA Persian
MY Burmese
NE Nepali
MR Marathi
KN Kannada
HA Hausa
YO Yoruba
SW Swahili
IG Igbo
ID Indonesian
TSI
PT Portuguese
VI Vietnamese
AR Arabic
AVD
RU Russian
UK Ukrainian
RO Romanian
BTF
IT Italian
FI Finnish
TO Tongan
HR Croatian
SR Serbian
TR Turkish
HU Hungarian
PL Polish
SK Slovak
LA Latin
NL Dutch
CS Czech
FR French
ES Spanish
DE German
ETC Other languages
4:1
Waiting

బోయజు పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చున్నప్పుడు, అతడు చెప్పిన సమీపబంధువు అక్కడికి వచ్చాడు. “నా స్నేహితుడా, ఇక్కడకు వచ్చి కూర్చో” అని బోయజు అన్నాడు. కాబట్టి అతడు వెళ్లి కూర్చున్నాడు.

4:2
Waiting

బోయజు ఆ పట్టణ పెద్దలలో పదిమందిని తీసుకుని వచ్చి, “ఇక్కడ కూర్చోండి” అని చెప్పాడు, వారు కూర్చున్నారు.

4:3
Waiting

అతడు ఆ బంధువుతో అన్నాడు, “మోయాబు నుండి తిరిగివచ్చిన నయోమి, మన బంధువైన ఎలీమెలెకుకు చెందిన భూమిని అమ్మి వేస్తుంది.

4:4
Waiting

ఈ విషయం నీ దృష్టికి తీసుకురావాలని, నీవు నా ప్రజల పెద్దల ఎదుట దానిని కొనాలని నేను అనుకున్నాను. నీవు విడిపిస్తే విడిపించు. కాని ఒకవేళ నీవు విడిపించకపోతే నాకు చెప్పు, నేను తీసుకుంటాను. ఎందుకంటే నీకు తప్ప ఇంకెవరికీ ఆ హక్కు లేదు, నీ తర్వాత నేను ఉన్నాను.”

4:5
Waiting

అప్పుడు బోయజు అన్నాడు, “నయోమి దగ్గర నీవు ఆ భూమిని కొన్న రోజు, చనిపోయిన వాని భార్య, మోయాబీయురాలైన రూతు నీకు చెందుతుంది, ఈ విధంగా చనిపోయిన వాని స్వాస్థ్యంతో అతని సంతతిని నిలబెడతావు.”

4:6
Waiting

ఇది విని, ఆ బంధువు, “అయితే నేను దానిని విడిపించలేను, ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని కోలిపోతానేమో. నీవే దానిని విడిపించు. నేను చేయలేను” అని అన్నాడు.

4:7
Waiting

(ఇప్పుడు ఇశ్రాయేలులో పూర్వకాలంలో, ఆస్తిని విడిపించడం గాని బదిలీ చేయడం గాని నిర్ధారణ చేయడానికి, ఒక పక్షం వాడు తన చెప్పు తీసి ఇతర పక్షం వానికి ఇచ్చేవాడు. ఇశ్రాయేలులో లావాదేవీలను చట్టబద్ధం ఇలాగే చేసేవారు.)

4:8
Waiting

కాబట్టి ఆ సమీపబంధువు బోయజుతో, “నీవే దానిని కొనుక్కో” అని చెప్పి, తన చెప్పును తీశాడు.

4:9
Waiting

అప్పుడు బోయజు పెద్దలకు, ప్రజలందరికి ఇలా ప్రకటించాడు, “ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గర నుండి నేను కొనుక్కున్నాను. ఈ రోజు దీనికి మీరు సాక్షులు.

4:10
Waiting

అంతేకాక, చనిపోయిన మహ్లోను యొక్క విధవరాలు, మోయాబీయురాలైన రూతును నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ విధంగా చనిపోయినవాడి స్వాస్థ్యం మీద అతని పేరు స్థిరంగా ఉంటుంది, అతని కుటుంబం నుండి, అతని స్వస్థలం నుండి కొట్టివేయబడదు. ఈ రోజు మీరు సాక్షులు!”

4:11
Waiting

అప్పుడు పెద్దలు, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, “మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశాన్ని కట్టిన రాహేలు, లేయాల వలె చేయును గాక. ఎఫ్రాతాలో నీవు ఘనత పొంది, బేత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక.

4:12
Waiting

యెహోవా ఈ యువతి ద్వారా నీకు ఇచ్చే సంతానం ద్వారా, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు వలె ఉండును గాక!” అని అన్నారు.

4:13
Waiting

బోయజు రూతును చేర్చుకున్నాడు, ఆమె తన భార్య అయ్యింది. ఆమెతో పడుకున్నప్పుడు, యెహోవా ఆమె గర్భవతి అయ్యేలా దీవించారు, ఆమె ఒక కుమారున్ని కన్నది.

4:14
Waiting

అప్పుడు స్త్రీలు నయోమితో అన్నారు: “ఈ రోజున నిన్ను విడిపించే సమీపబంధువు ఉండేలా చేసిన యెహోవా స్తుతినొందును గాక. ఇశ్రాయేలులో అతనికి ఖ్యాతి కలుగును గాక!

4:15
Waiting

అతడు నీ జీవితాన్ని నూతనపరచి, నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే, ఏడుగురు కుమారుల కంటే ఉత్తమమైన నీ కోడలు, అతనికి జన్మనిచ్చింది.”

4:16
Waiting

నయోమి ఆ బాలున్ని తన చేతుల్లోకి తీసుకుని వానికి దాదిగా ఉన్నది.

4:17
Waiting

అక్కడ నివసిస్తున్న ఆమె పొరుగు స్త్రీలు, “నయోమికి కుమారుడు ఉన్నాడు!” అని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. అతడు దావీదు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి.

4:18
Waiting

ఇది పెరెసు వంశావళి:

4:19
Waiting

హెస్రోను కుమారుడు రాము.

4:20
Waiting

అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.

4:21
Waiting

శల్మాను కుమారుడు బోయజు,

4:22
Waiting

ఓబేదు కుమారుడు యెష్షయి.