వారు దేవుని మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచి వారు దేవుని సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించారు.
JA
Copywork
Telugu OTSA 1 Chronicles 16장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · 1 Chronicles
దావీదు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, అతడు యెహోవా పేరిట ప్రజలను దీవించాడు.
అప్పుడతడు ఇశ్రాయేలీయులలో ప్రతి పురుషునికి, స్త్రీకి ఒక రొట్టె, ఒక ఖర్జూర పండ్ల రొట్టె, ఒక ద్రాక్షపండ్ల రొట్టె ఇచ్చాడు.
తర్వాత అతడు యెహోవా మందసం దగ్గర సేవ చేయడానికి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కీర్తించడానికి స్తుతించడానికి, కృతజ్ఞతలు అర్పించడానికి లేవీయులలో కొంతమందిని నియమించాడు.
వారిలో ఆసాపు నాయకుడు, అతని తర్వాతి నాయకుడు జెకర్యా, తర్వాత యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేద్-ఎదోము, యెహీయేలు. వారు వీణలు, సితారలు వాయించడానికి నియమించబడ్డారు. ఆసాపు తాళాలను వాయించేవాడు.
యాజకులైన బెనాయా, యహజీయేలు దేవుని నిబంధన మందసం ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు.
ఆ రోజు దావీదు యెహోవాను స్తుతించడానికి మొదటిసారిగా ఆసాపు, అతని తోటివారికి ఇలా పాడమని చెప్పాడు:
యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;
ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి;
ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి;
యెహోవాను, ఆయన బలాన్ని చూడండి;
ఆయన సేవకులైన ఇశ్రాయేలు వారసులారా!
ఆయన మన దేవుడైన యెహోవా;
ఆయన తన నిబంధనను,
అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను
ఆయన దానిని యాకోబుకు శాసనంగా,
“నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను
వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు,
వారు దేశం నుండి దేశానికి,
ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు;
“నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు;
సమస్త భూలోకమా! యెహోవాకు పాడండి;
దేశాల్లో ఆయన మహిమను,
యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు;
ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు,
వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి.
ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి,
యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకు చెల్లించండి.
సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి,
ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి;
సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి;
అడవి చెట్లు పాటలు పాడాలి,
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి;
ఇలా మొరపెట్టండి: “దేవా, మా రక్షకా! మమ్మల్ని రక్షించండి;
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
యెహోవా నిబంధన మందసం ఎదుట ప్రతిరోజు క్రమంగా సేవ చేయడానికి, దావీదు దాని దగ్గర ఆసాపును, అతని తోటి వారిని నియమించాడు.
అలాగే ఓబేద్-ఎదోమును, అతని అరవై ఎనిమిది మంది తోటి వారిని కూడా అక్కడ నియమించాడు. యెదూతూను కుమారుడైన ఓబేద్-ఎదోము, హోసా అనేవారు ద్వారపాలకులు.
దావీదు యాజకుడైన సాదోకును, అతని తోటి యాజకులను గిబియోనులోని ఆరాధన స్థలంలో ఉన్న యెహోవా సమావేశ గుడారం దగ్గర ఉంచాడు.
యెహోవా ఇశ్రాయేలీయులకు ఆదేశించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం, ప్రతిరోజు ఉదయ సాయంత్రాల్లో క్రమంగా బలిపీఠం మీద దహనబలి యెహోవాకు అర్పించడానికి దావీదు వారిని నియమించాడు.
“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అంటూ ఆయనకు కృతజ్ఞతలు అర్పించడానికి వారితో కూడ హేమాను, యెదూతూను, పేర్లు చెప్పి ఎన్నుకున్న మరి కొంతమందిని అతడు నియమించాడు.
బూరధ్వని చేయడానికి, తాళాలు వాయించడానికి, దేవున్ని స్తుతించడానికి ఇతర వాయిద్యాలను వాయించడానికి హేమాను, యెదూతూనులను నియమించాడు. యెదూతూను కుమారులను ద్వారపాలకులుగా నియమించాడు.
తర్వాత ప్రజలంతా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. దావీదు తన కుటుంబాన్ని దీవించడానికి తన ఇంటికి తిరిగి వెళ్లాడు.