ప్రతిదానికీ ఒక సమయం ఉంది,
EN
Copywork
Telugu OTSA Ecclesiastes 3장
Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
Practice by section · Ecclesiastes
పుట్టడానికి సమయం చావడానికి సమయం,
చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం,
ఏడ్వడానికి, నవ్వడానికి
రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి,
వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం,
చింపివేయడానికి, కుట్టడానికి,
ప్రేమించడానికి, ద్వేషించడానికి,
కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి?
మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను.
ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు.
మనుష్యులు జీవించినంత కాలం సంతోషంగా ఉంటూ, మంచి చేయడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను.
ప్రతి ఒక్కరు తిని త్రాగుతూ తన కష్టార్జితాన్ని ఆస్వాదించడమే దేవుని వరమని నేను తెలుసుకున్నాను.
దేవుడు చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు; దానికి ఏమీ జోడించలేము దాని నుండి ఏమీ తీసివేయలేము. ప్రజలు ఆయనకు భయపడేలా దేవుడు అలా నియమించారు.
ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగిందే.
సూర్యుని క్రింద ఈ భూమి మీద మరో విషయం నేను చూశాను.
నేనిలా అనుకున్నాను,
నేను ఇంకా ఇలా అనుకున్నాను, “మనుష్యుల తాము జంతువుల్లాంటివారని గ్రహించేలా దేవుడు వారిని పరీక్షిస్తారు.
ఖచ్చితంగా జంతువులకు జరిగినట్లే మనుష్యులకు జరుగుతుంది. వారిద్దరి విధి ఒక్కటే; జంతువులు చనిపోతాయి మనుష్యులు చనిపోతారు. అంతా అర్థరహితమే.
అంతా వెళ్లేది ఒక చోటికే; సమస్తం మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది.
ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?”
కాబట్టి మనుష్యులు తమ పనిని ఆస్వాదించడం కంటే మెరుగైనది ఏదీ లేదని నేను గ్రహించాను, ఎందుకంటే అదే వారు చేయవలసింది. వారి తర్వాత ఏమి జరుగుతుందో చూడటానికి వారిని ఎవరు వెనక్కి తీసుకురాగలరు?