యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి విడిపించినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో ఈ పాట పాడాడు.
JA
Copywork
Telugu OTSA 2 Samuel 22장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · 2 Samuel
అతడు ఇలా పాడాడు:
నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ,
“స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను,
మరణపు అలలు నన్ను చుట్టుకున్నాయి;
సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి;
“నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను;
అప్పుడు భూమి కంపించి అదిరింది,
ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది;
ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు;
ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు.
ఆయన చీకటిని తన చుట్టూ పందిరిగా,
ఆయన సన్నిధి కాంతి నుండి
యెహోవా పరలోకం నుండి ఉరిమారు.
ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు,
యెహోవా గద్దింపుకు,
“ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు;
శక్తివంతమైన నా శత్రువు నుండి,
నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు,
ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు;
“నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు;
నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను;
ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి;
ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను,
నా నీతిని బట్టి ఆయన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి
“నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు,
నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు,
మీరు దీనులను రక్షిస్తారు,
యెహోవా! మీరు నాకు దీపము;
మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను;
“దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది;
యెహోవా తప్ప దేవుడెవరు?
బలంతో నన్ను సాయుధునిగా చేసేది,
నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు;
నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు;
మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు,
నా చీలమండలాలు జారిపోకుండ
“నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను;
వారు మళ్ళీ లేవకుండా వారిని పూర్తిగా నలుగగొట్టాను;
మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు;
మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు,
వారు సాయం కోసం మొరపెట్టారు
భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను;
“జనాల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు;
విదేశీయులు నా ముందు భయపడుతున్నారు;
వారందరి గుండె జారిపోతుంది;
“యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి!
నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే,
నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే.
అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
“ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు;