యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు;
మీరు మీ ప్రజల దోషాన్ని క్షమించారు
మీ ఉగ్రతను మీరు ప్రక్కన పెట్టారు
మా రక్షకుడవైన దేవా, మమ్మల్ని మరల పునరుద్ధరించండి.
ఎప్పటికీ మీరు మామీద కోప్పడతారా?
మీ ప్రజలు మీలో ఆనందించేలా
యెహోవా, మీ మారని ప్రేమను మా పట్ల చూపించండి,
దేవుడైన యెహోవా చెప్తున్నదంతా నేను ఆలకిస్తాను;
మన దేశంలో ఆయన మహిమ నివసించేలా,
మారని ప్రేమ నమ్మకత్వం కలుసుకుంటాయి;
నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది,
యెహోవా మేలైనది అనుగ్రహిస్తారు,
ఆయనకు ముందుగా నీతి వెళ్తూ